

జనం న్యూస్ ఆగస్టు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో మంగళవారం రోజునా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంనిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్.ఐపడాల రాజేశ్వర్ పాల్గొని గ్రామ ప్రజలకు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తలు, గంజాయి వంటివి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.సమాజంలో యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడం, అలాగే సైబర్ మోసాలను గుర్తించే మరియు నివారించే మార్గాలను వివరించటం ద్వారా ప్రజలలో భద్రతపై చైతన్యం కలిగించడమే ఈ కార్యక్రమంయొక్క ముఖ్య ఉద్దేశ్యం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు.