

జనం న్యూస్ ఆగస్టు 7 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో యూరియాను పంటలకు ఒకేసారి కాకుండా వివిధ దశల్లో విడదీసి వేయడాన్ని యూరియా స్ప్లిట్ అప్లికేషన్(విడతలవారీగా వేయడం) అంటారు. ఇలా చేయడం వల్ల నత్రజని నష్టాన్ని తగ్గిస్తుంది, పంటల ద్వారా పోషకాల గ్రహణ సామర్థ్యాన్ని పెంచుతుంది, పంట దిగుబడిని పెంచుతుంది, పెట్టుబడి ఖర్చును తగ్గిస్తుంది, ఇలా చేయడం నేల ఆరోగ్యానికి చాలా మంచిది.
రైతులు నియమిత సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల చీడ పీడలు ఎక్కువగా సోకే అవకాశం ఉంది ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరిగింది, రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువగా యూరియా వాడుతున్నారని అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, ఏ ఈ ఓ కృష్ణవేణి మరియు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు