Listen to this article

జనం న్యూస్ 27 జనవరి 2024 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని సంత జూటూరు, రామాపురం గ్రామాలలో పశు వైద్యాధికారులు డాక్టర్ అనూష, డాక్టర్ గౌసియా బేగం, వి ఎల్ వో నూర్ అహ్మద్, గురువారం నాడు ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాలలో అనారోగ్య పశువులకు చికిత్సలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భాధారణ, చూడి తనిఖీలు నిర్వహించారు.ఇతర రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులు పశువుల ఆరోగ్యం పై దృష్టి సారించి దిగుబడి పెంచుకోవాలని సూచించారు. అనంతరం పాడి రైతులకు మినరల్ మిక్చర్, లివర్ టానిక్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్ర పాల్గొన్నారు.