Listen to this article

విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి||

జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణం కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పనులు నిమిత్తం ఆగష్టు 7న సాయంత్రం
కామాక్షినగర్ వద్ద ఆటో ఎక్కి విజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయారు. ఆమె ఆటోలో బ్యాగు
మర్చిపోయినట్లుగా తరువాత గుర్తించి, వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి ఆదేశాలతో వన్ టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు మరియు సిబ్బంది వెంటనే ఆటోను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు చేపట్టిన చర్యలలో భాగంగా దగ్గరలో లభించిన సి.సి.టి.వి. ఫుటేజ్ ఆధారంగా ఆటోను ట్రేస్ చేయగా,ఆటోలో బ్యాగు లభించింది. అనంతరం, బ్యాగును అందులోగల ఆరు తులాల బంగారు ఆభరణాలను వన్ టౌన్ క్రైమ్ ఎస్పై సురేంద్ర నాయుడు బాధితురాలైన పిల్ల పద్మకు వన్ టౌన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆటో డ్రైవర్ కూడా ఆటో వెనుక ఉన్న బ్యాగును గుర్తించలేనట్లుగా పోలీసులు తెలిపారు. ఆటోను ట్రేస్ చేసి బ్యాగును, విలువైన బంగారు ఆభరణాలను అప్పగించుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్పై సురేంద్ర నాయుడు, సిబ్బందిని సిఐ ఆర్.వి.ఆర్.కే.
చౌదరి1 అభినందించారు.