Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం

సంగారెడ్డి జిల్లా 10/8/2025 అందోల్ జోగిపేట మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పర్వదినాన్ని శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ మరియు జంధ్యాల పూర్ణిమ గా భారతదేశమంతా జరుపుకునే కులమత బేధాలు లేకుండా ఒక వసుదైక పండుగని, చాటే ఒక అర్థం ఈ రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని, అన్న దమ్ములు లేని వారు కూడా తమ సొంత వారిగా భావించే వారికి కూడా రాఖీ కట్టి ఈ పండుగను జరుపుకుంటారని, అన్నా, చెల్లెలు మరియు అక్క, తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రత్యేక. అమ్మానాన్నల తర్వాత ప్రేమను పంచే సోదరులుగా అన్నింట విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీ లో ప్రేమాను రాగాలు ఇమిడి ఉన్నాయని, ఆ క్షణం చెల్లిపోయేది కాదని జీవితంలో నిలిచి పోయేదని, అన్నయ్య కలలు పండాలన్న చెల్లెమ్మ మనసు నిండాలన్న రాఖీ పౌర్ణమి కే సాధ్యమని తెలిపారు.