

జనం న్యూస్ ఆగస్టు 11
ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న బలభద్రపు సుధీర్ హోటల్ రంగంలో కూడా రాణించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి అభిలషించారు. రాజధాని అమరావతికి కూత వేటు దూరంలోని మందడం గ్రామంలో నిర్మించిన బలభద్ర గ్రాండ్ హోటల్ ను ఆయన సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ సుధీర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అత్యాధునిక వసతులతో కూడిన 40 గదులను తాము అందుబాటులో ఉంచామని బలభద్ర గ్రాండ్ యజమాని సుధీర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల బాబీతోపాటు ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు లక్కింశెట్టి నానాజీ అమృత హోమ్ నీడ్స్ అండ్ ఫైనాన్స్ ప్రోప్రైటర్ సత్తిబాబు జేపీ కన్స్ట్రక్షన్ ఎండి జయప్రకాష్ పలువురు రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు
