

సాయి కిరణ్ కోలుకున్నంత వరకు ఆర్థిక సహాయం చేస్తా చారుగుండ్ల.
జనం న్యూస్,11ఆగస్టు,జూలూరుపాడు
మండలం గుండేపూడి గ్రామ వాస్తవ్యులు మునగాల సాయి కిరణ్ కు 2023 సంవత్సరంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో తలకు గాయం కావడంతో తలకు ఆపరేషన్ అనంతరం ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఉద్యోగానికి పోలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు జూలూరుపాడు ఆర్యవైశ్య నాయకులు మహంకాళి గోపాలకృష్ణ,వందనపు సత్యనారాయణ సహకారంతో అప్పుటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి చారుగుళ్ల శ్రీనివాస్ సాయి కిరణ్ విధులలో చేరేవరకు ప్రతి నెల రూ 1,000 చొప్పున జీవితకాలం పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీ లో భాగంగా సాయి కిరణ్ కు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు ఈ సేవా కార్యక్రమం లో భాగంగా (31 వ) నెల ఆగష్టు 2025 పెన్షన్ రూ 1,000 జూలూరుపాడు మండల, పట్టణ అధ్యక్షులు శ్రీ ఉడతా వెంకటేశ్వర్లు, శ్రీ ఉడతా వేణు గోపాలరావు చేతుల మీదుగా తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ ఉపాధ్యక్షులు వందనపు సత్యనారాయణ, తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షులు మహంకాళి గోపాలకృష్ణ సమక్షంలో అందజేశారు.ఈ కార్యక్రమం లో వేముల నాగేశ్వరరావు,చల్ల జనార్ధన్,వంకదారి వెంకటేశ్వరరావు ,ఉడతా వినయ్ కుమార్,నుదురుపాటి ప్రేమ్ కిషోర్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.