

జనంన్యూస్. 12.నిజామాబాదు.ప్రతినిధి.
ఇందూర్ నగరం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది.
బిజెపి నాయకులు, కార్యకర్తలు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకీ జై అనే నినాదాలతో ఇందూర్ నగరం హోరేత్తి పోయింది. తిలక్ గార్డెన్స్ చౌరస్తా లో సామూహిక జాతీయ గీతలాపన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తల్లి భారతవని దాస్య సంకెళ్లు తెంచడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అర్పించడం జరిగిందని వారి బలిధానాల కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ వాయువును పీల్చుకొగాలుగుతున్నాం అని అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటు భారతదేశ ఐక్యతను, జాతీయతను దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే విదంగా భారత దేశమంతటా నరేంద్రమోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇందూర్ నగరంలోని గాంధీ చౌక్ నుండి తిలక్ గార్డెన్ వరకు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి అంటే కారణం మనలో ఉన్న దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయలే అని తల్లి తండ్రులు కానీ గురువులు కానీ చిన్నప్పటినుండే పిల్లలలో దేశభక్తి పెంపొందించే విదంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జిజీయాభాయ్ ఎలా దేశభక్తిని నూరి పోషిందో ఆ విదంగా ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజ్ ను తయారు చేయాలన్నారు. సమాజంలో మనుషులు ఎందరో పుడుతుంటారు కానీ చరిత్రలో కొందరే నిలుస్తారు అని అలా చరిత్ర పూటలలో నిలిచినవారిలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి వీరులను, వీరవనీతలను ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలించి దోచుకుంటే, మత ప్రతిపదికన ఈ దేశాన్ని విచ్చిన్నం చేసింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో తల్లి భరతమాత తల వంటి భాగం కాశ్మీర్ లో మన త్రివర్ణ పథకాన్ని ఎగురావేయలేని పరిస్థితి మనం చూసాం అని కానీ కేంద్రంలో బిజెపి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ఈ రోజు కాశ్మీర్ వికసిత్ భారత్ లో స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటుందని , దేశంలో శాంతి భద్రతలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అట్టడుగు స్థాయి చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు చేరుతున్నాయని అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ఒక గుణపాఠం అన్నారు, భారత్ రక్షణ వ్యవస్థ చూసి ప్రపంచ దేశాలు నివ్వేర పోయాయాని అన్నారు ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని, భారతీయుల అందరి లక్ష్యం జాతీయ పునర్నిర్మాణం భారత దేశాన్ని విశ్వగురుగా చూడాలనే సంకల్పం సాకారానికి మహనీయుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
