పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక నిర్వహణ అవగాహన సదస్స

July 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ న్యూస్ జూలై 4 శ్రీనివాస్ రెడ్డి :పోలీసు సిబ్బంది ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు కూకట్‌పల్లిలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్‌లో శనివారం ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలానగర్ డివిజన్‌కు చెందిన పోలీసు సిబ్బంది, ట్రాఫిక్ విభాగం, ఏఆర్ ఫోర్స్‌కు చెందిన మొత్తం 125 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సదస్సుకు వనరుల వ్యక్తిగా డి. శ్రీధర్ రావు హాజరై ఆర్థిక అవగాహన, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ, మెరుగైన భవిష్యత్‌కు ఆర్థిక భద్రత వంటి అంశాలపై సవివరంగా వివరించారు. అలాగే ఆర్థిక మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు అనుసరించాల్సిన ఆర్థిక నిర్వహణ విధానాలపై సూచనలు చేశారు.ఈ కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీతో పాటు కూకట్‌పల్లి, బాలానగర్, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, డీఐలు, ఎస్‌ఐలు హాజరై సిబ్బందిని ప్రోత్సహించారు.పోలీసు సిబ్బందిలో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ సదస్సు విజయ వంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper