Listen to this article

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయవాడ లోని గవర్నర్ పేట I & II డిపోలు మరియు పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాలను లులూ షాపింగ్ మాల్ ఏర్పాటు కొరకు జి.ఓ.నెం. 137 ద్వారా కేటాయిస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జి.ఓ.నెం. 137 రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఎపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి హెచ్చరించారు. మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఏర్పాటుచేసిన పత్రిక సమావేశం తెలిపారు. ఆర్టీసీ ఆస్థులు కాపాడుకునేందుకు ఆర్టీసిలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వా మ్యం అవుతున్నాయని, ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసి) ఆస్థులు ప్రైవేటు వ్యాపారవేత్తలకు దారాదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు.నెం. 137 ద్వారా కట్టబెట్టిన జి.ఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ప్రతిరోజూ సుమారు 65 లక్షల మందికి సేవలు అందించవలసిన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడమంటే సంస్థను ప్రైవేట్ పరం చేయడమేనని ఉద్యోగస్తులు భావిస్తున్నందున ఉద్యోగులు అంతా ఒక్కటై ప్రజా సంఘాలతో కలసి ఉద్యమాలు బాట పట్టకముందే జిఓ నెం. 137ను రద్దు చేయాలని ఆయన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడటం బాధాకరమని అన్నారు..ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. రవికుమార్. డిపో కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిహెచ్ పి పట్నాయక్, తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.