Listen to this article

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా తేదీ ఆగస్టు 13, (రిపోర్టర్ ప్రభాకర్):

రైతు బాగుంటేనే అందరం బాగుంటామని, అటువంటి రైతులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇటీవల రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ అయిన సందర్భంగా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామం నుంచి పార్వతీపురం మార్కెట్ యార్డ్ వరకు ఆనందోత్సవ ర్యాలీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా నర్సిపురం గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సెంట్లు ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయడం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రతి రైతు ఖాతాలో 7000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు సైతం ఈ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేస్తుందని, త్వరలోనే కౌలు రైతులకు కేవైసీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి 20వేల రూపాయలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతు బాగుంటేనే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందని అన్నారు. అన్నం పెట్టిన రైతు బాగుండాలని మనమంతా కోరుకుందాం అన్నారు. రైతు కష్టాలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతు కష్టాలు తీర్చడం జరుగుతుందన్నారు. ఈరోజు జరిగిన ఈ ఆనందోత్సవ ర్యాలీలో 130 ట్రాక్టర్లతో రైతుల పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్వతీపురం సీతానగరం, బలిజిపేట కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.