

జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిప్యూటీ డిఏహెచ్ఓ జయ మనోహరి అన్నారు.మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇద్దరు డెంగ్యూ వ్యాధి బారిన పడిన సంఘటనలో భాగంగా బుధవారం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోహరి కలకోవ గ్రామాన్ని సందర్శించి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణకు తగు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.