జనం న్యూస్ ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి
ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం
సిండికేట్ వ్యవస్థను రూపిమాపితేనే ఆక్వారంగం బతుకుతుంది
ప్రభుత్వం చొరవచూపి పరిష్కరించాలని డిమాండ్
పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతున్న ఆక్వా
రంగాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే ఆక్వారైతులు పూర్తిగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయి రాబోయే రోజుల్లో ఆక్వా పరిశ్రమే కనుమరుగయ్యే పరిస్థితి ఎదుర్కర్కోవలసి వస్తుందని ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో చనిపోతామని తెలిసినా ఎలా దేశ రక్షణ కోసం జవాను ముందుకు వెళతాడో.. నష్టం తప్పదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వారైతు ఆక్వారంగంలోనే కొనసాగుతున్నారని, ఇది చాలా ప్రమాదకర అప్పల ఊబిలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వారంగంలో ఉన్న సమస్యలన్నిటీపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే పరిష్కార మార్గాలను చూపాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో తొలగించిన విద్యత్తు కనెక్షన్లను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, రాష్ట్రంలో సుమారు 12 వేల కనెక్షన్లు సబ్సిడీను కోల్పోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆక్వా పరిశ్రమను 4.50 లక్షల ఎకరాల్లో ఉన్న సాగును పదిలక్షల ఎకరాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో కోరారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విస్తీర్ణం మరింత దిగజారిపోయేలా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక విదేశీ సుంకం 25శాతం పెంచుతామని ప్రకటించగానే అదిఅమలు కాకుండానే ఆమాటను ఆధారంగా చేసుకున్న



