జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
మెంటాడ, అనంతగిరి మండలం బూరిగ నుండి మెంటాడ మండలం వానిజ వరకు 2.5 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులు ముగించికుని తిరిగి ప్రయాణం అవ్వటానికి సిద్ధపడుతూ ప్రోక్లైన్ను విశాఖపట్నం తీసుకెళ్లడానికి ట్రాలీపై ఎక్కిస్తున్న సమయంలో ప్రోక్లైనర్ అదుపుతప్పి మీద పడిపోవడంతో ట్రాలీ డ్రైవర్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం రాత్రి 11 గంటలకు మెంటాడ మండలం వానిజ గ్రామానికి సమీపంలో ట్రాలీపై ప్రోక్లైన్ ను ఎక్కిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారని మెంటాడకు చెందిన తాడి రాంబాబుకు తీవ్ర గాయాలు అయ్యాయని కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నం ఆండ్ర ఎస్ఐ సీతారాం తెలిపారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


