Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,నందలూరు మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం,హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుడు ,జవాన్ దారా రత్నమయ్యను బుధవారం ఎంపీడీవో రాధాకృష్ణన్,డిప్యూటీ ఎంపీడీవో,సునీల్ కుమార్,నందలూరు గ్రామపంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసులు ,సర్పంచ్ మోడపోతుల, రాము శాలువాకప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు తన ఇంటి పై భాగంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావనను మరింతగా పెంపొందించడంతోపాటు స్వాతంత్రసమరయోధుల త్యాగాలనుస్మరించుకోవాలి ఆయన సూచించారు, కార్యక్రమంలోనందలూరు పంచాయతీ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు,