

జనం న్యూస్, ఆగస్టు 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్విఎం హాస్పిటల్ నుండి రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డు వరకు గురువారం బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు,ఈ కార్యక్రమంలో హాజరైన సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మాట్లాడుతూ అందరికీ ముందస్తు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని, భారత ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని, అన్నారు ములుగు మండల బిజెపి ఆధ్వర్యంలో ఆర్విఎం హాస్పిటల్ నుండి అత్యంత ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు, ఈ కార్యక్రమంలో ములుగు మండల బిజెపి ఇంచార్జ్ నందన్ గౌడ్,బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్,మాజీ అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్, కట్ట భాగ్యలక్ష్మి, పంజాల అశోక్ గౌడ్,సురేష్,హరికృష్ణ,కిట్టు యాదవ్,ఆనంద్,ప్రవీణ్ గౌడ్, ఆర్విఎం హాస్పిటల్ అధ్యాపకులు,డాక్టర్స్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
