Listen to this article

జనం న్యూస్ – ఆగస్టు 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు గురువారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఎన్.సి.సి క్యాడెట్లు 31టి నల్గొండ బెటాలియన్ అధికారుల ఆదేశానుసారం హిల్ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ప్రాముఖ్యత స్లోగన్సును పలుకుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్సిసి క్రెడిట్లకు అధికారులు దాని ప్రాముఖ్యతను వివరించారు.ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన( PMJAY) అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి పూర్తిగా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు పంచబడతాయి. ప్రధానమంత్రి జనయోజన దాదాపు 10.74 కోట్ల పేద దుర్బల కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు) ద్వితీయ మరియు తృతీయ ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ప్రధానమంత్రి జన యోజన అనేది అర్హత ఆధారిత పథకం.ఎస్.ఈ.సి.సి డేటా ప్రకారం పేద, దుర్బల కుటుంబాలను లేమి, వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా ఈ పథకం కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ రవికుమార్, ఏటిపి సంతోష్ ,సిటిఓ గణేష్, మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.