Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 14- నాగార్జునసాగర్ రిపోర్టర్ విజయ్ –

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది .  గురువారం అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతు కూరాకుల లక్షయ్య(48) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తన వ్యవసాయ బావివద్ద ఉన్న పొలానికి పంపింగ్ చేసే మోటారు వర్షానికి చెడిపోతుందన్న ఉద్దేశంతో మోటారుకు సంబంధించిన స్టార్టర్, విద్యుత్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేద్దామని ఉదయాన్నే  కురుస్తున్న వర్షంలో తాము వద్దని వారించినా వినకుండా పొలం వద్దకు వెళ్ళాడని అక్కడ మోటార్లకు సంబంధించిన స్టార్టర్, విద్యుత్ కనెక్షన్లను  డిస్కనెక్ట్ చేస్తూ ఉండగా అప్పటికే రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిపడిన విద్యుత్ వైరు తగిలి విద్యుత్ఘాతంతో పొలంలో అపస్మారక స్థితిలో పడిపోయాడని
వెంటనే సమీపంలో ఉన్న సహచర రైతులు గమనించి తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా
వెంటనే వారు స్థానిక కమలా నెహ్రు ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు.  మృతి చెందిన రైతుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.