Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ లోని ప్రొఫెసర్ జయశంకర్ భవన్ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని,ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా నేడు మనం స్వేచ్ఛావాయువును పీల్చుకుంటున్నామని విద్యార్థి దశ నుండే పిల్లల్లో దేశభక్తి మహనీయుల స్ఫూర్తిని నింపాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సపవత్ చంద్రమౌళి నాయక్, గాజుల రాము, ప్రసాద్, జి భద్రయ్య, సంగీతరావు, శేఖరా చారి ,వెంకటయ్య, లక్ష్మయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.