Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతలపల్లి అంగన్వాడి సెంటర్ కు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీవీ ని డొనేట్ చేసిన మాదారం అజయ్, కుని తిరుమలయ్య అంగన్వాడి టీచర్ లక్ష్మిదేవి కి అందజేశారు. అంగన్వాడి టీచర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్ కు టీవీ డొనేట్ చేసినందుకు చాలా సంతోషమని టీవీ వల్ల పిల్లలకు డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా మాదారం అజయ్, కుని తిరుమలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.