

జనం న్యూస్,ఆగస్టు15,అచ్యుతాపురం:
మోసయ్యపేట ప్రభుత్వ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 13న నిర్వహించిన ఆటల్లో కిందపడి చేయి విరిగిన పేద విద్యార్థి ఉరుము నవ్య శ్రీకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము డిమాండ్ చేశారు.ఆటలో విద్యార్థులు మీద పడ్డంతో కుడిచేయి విరిగి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగో తరగతి విద్యార్థి నవ్య శ్రీని శుక్రవారం రాము పరామర్శించారు.ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసుకొనే స్తోమతలేని పేద కుటుంబానికి చెందిన పేద విద్యార్థికి మెరుగైన వైద్యం అందేలా విద్యాశాఖాధికారులు మరియు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.