Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మాందారి పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ రమేష్ తీరంగి జెండాను ఎగురవేశారు . ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయాగ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాందారి పేట గ్రామ ప్రత్యేక అధికారిని గంగా జమున కార్యదర్శి అజయ్ మాజీ సర్పంచ్ రేనుకుంట్ల సదయ్య గ్రామ ప్రముఖులు యువజన సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారు హాజరయ్యారు . ఈ పాఠశాలలో పాఠశాల పూర్వ విద్యార్థుల తోడ్పాటుతో పాఠశాల మొదటి అంతస్తులో కోతుల బెడద నివారణ కోసం ఫెన్సింగ్ ఏర్పాటు ఆటస్థలం చదును చేయడం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మొదలగు అభివృద్ధి పనులు దాతల సహకారంతో చేయడం జరిగింది .పాఠశాల అభివృద్ధి కోసం ఆది రెడ్డి మల్లారెడ్డి ఇంద్రసేనారెడ్డి ,వీరారెడ్డి వెంకటరమణారెడ్డి యాదవ రెడ్డి రాఘవ రెడ్డి మహేందర్ రెడ్డి ఈశ్వరయ్య కడారి రమేష్ భూపతి రెడ్డి రమణయ్య కొమురయ్య రోహిణి సాయి దత్త కన్స్ట్రక్షన్ వారు సహాయం అందజేశారు ఇటువంటి సహాయాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బీద విద్యార్థుల విద్యాభివృద్ధికి అందించిన దాతలు అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు….