

జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, అనంతరం స్టేషన్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సాధించేందుకు చాలామంది స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాల కృషి ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.