

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గానే దేశ స్వాతంత్రం సిద్ధించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 79 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల స్వాతంత్ర్య కాంక్షలు నెరవేర్చి అమరులైన త్యాగమూర్తులకు శిరస్సు వంచి నమస్సుమాంజలు అర్పిస్తున్నామన్నారు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మారపల్లి రవీందర్ చిందం రవి వైనాల కుమారస్వామి దుబాసి కృష్ణమూర్తి రాజ్ కుమార్ ఎం డి హైదర్ ఐలయ్య వరదరాజు కట్టయ్య బాసాని మార్కండేయ ఎం డి రఫీ బాసని రవి మామిడి సుదర్శన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు….