

జనం న్యూస్ ఆగస్టు 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది నాయకులు కృషి చేసి జననష్టం జరిగి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి దేశానికి స్వాతంత్రం వచ్చిందని, నేటి యువతీ యువకులు సమాజానికి ఉపయోగపడే విధంగా,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలనకు పి ఫోర్ విధానాన్ని తీసుకువచ్చారని పేదలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని తాతయ్యబాబు అన్నారు. నాగ జగదీష్ మాట్లాడుతూ 1995లో నారా చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో సంస్కరణ రావడంతో గ్లోబలేషన్, మోడ్రనేషన్ దానికి అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజీలు ఐటీ రంగాన్ని తీసుకువచ్చి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు తో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఐటీ రంగంలో ఆయా దేశాల్లో ప్రముఖ పాత్ర వహించడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడని, నాల్గవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు సాగునీరు ప్రాజెక్టులు, ఐటీ సంబంధించి పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, అలాగే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు వెళుతుందని, తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్యమత్యంతో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు శంకర్ల పద్మలత గుడాల సత్యనారాయణ దాడి అప్పారావు పొలిమేర నాయుడుమల్ల గణేష్ మల్ల శివన్నారాయణపిళ్ళా తారకేసు దూలం ప్రసాదు బర్నికాన శ్రీనివాసరావు కొమ్మోజు రామకృష్ణ పోతున గంగాధర్ విల్లూరి అప్పలనాయుడు పెంటకోట వాసు కైచర్ల లోకేష్ బీశెట్టి అప్పారావు కోరుబిల్లి మహాలక్ష్మి నాయుడ పిన్నింటి కనకారావు బుద్ధ కాశీ గుర్రాల వాసు సూరిశెట్టి శ్రీనివాసరావు కొణతాల సత్యనారాయణ సూరిశెట్టి బల్లమ్మ కాండ్రేగుల వెంకట సూరి రేబాక లోవరాజు కాండ్రేగుల జగదీష్ బుద్ధ విశ్వనాథం బొడ్డేడ మణికంఠ బొడ్డేడ అయ్యప్ప దాడి వేణు చదరం శివ అప్పారావు పెంటకోట వరప్రసాద్ విల్లూరి రమణబాబు కొణతాల గణేష్ పెంటకోట శివరామ పైలా గోపి వేదుల సూర్యప్రభ బొడ్డేడ నూకరాజు కోటేశ్వరరావు పెంటకోట ఆనంద్ కాండ్రేగుల ముకుంద కోరుకొండ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.//