

జనం న్యూస్ ఆగస్టు 15 నడిగూడెం
నడిగూడెం మండల తహశీల్దార్ సరిత జిల్లా ఉత్తమ తహశీల్దారుగా ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ తహశీల్దార్ అవార్డును అందుకున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నడిగూడెం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ తహశీల్దారుగా ఎంపికైన మండల తహశీల్దార్ సరితను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్సూర్ నాయక్, సూపరిండెంట్ ఇమామ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్నా శ్రీనివాస్,సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ అఫ్జల్, మొలుగూరి గోపి, మోత్కూరు శ్రీనివాస్, కుంచం ఉపేందర్, తంగేళ్ల లింగయ్య, నెమ్మాది రమేష్, పులి లక్ష్మణ్, నాయకులు బడేటి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సత్యనారాయణ, కోరట్ల శ్రీనివాస్, ఈసీ శ్రీనివాస్, సిఓలు విజయ్, కృష్ణ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.