

జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
డెంగ్యూ వ్యాధులు, మరియు వైరల్ ఫీవర్ (జ్వరాలు) తగ్గుముఖం పట్టే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని రేపాల ప్రాథమిక వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశించారు. మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇటీవలే ఆరుగురికి డెంగ్యూ వ్యాధి వ్యాపించడంతో గ్రామంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సర్వే ఆధారంగా జ్వరాల సోకిన వారి ఇంటింటికి ఆయన వెళ్లి ఆరోగ్య పరిస్థితిని క్లుప్తంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రామంలో వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహిస్తుంది సద్విని పరుచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో వారం రోజులు పాటు డ్రైడే కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట, డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోహరి,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీశైలం , జిల్లా అధికారులు సురేందర్, రేపాల వైద్యాధికారి వినయ్ కుమార్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.