రైతులకు వరి విత్తనాలు పంపిణీ
జనం న్యూస్, జూలై 04,అచ్యుతాపురం :స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీ రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలమంచిలి టిడిపి ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఈరోజు అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో అర్హులైన రైతులకు రాయితీ పై వరి విత్తనాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ కూనిశెట్టి సత్తిబాబు, కొలగాని శేషు,చిన్ని దొరబాబు,అగ్గాల భాస్కరరావు,తంటపు రెడ్డి త్రినాథ్, వ్యవసాయ అధికారి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.