

జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాదు.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపిక ల వేషధారణలో అందరినీ అలరించారు.కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది పాఠశాల ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థుల ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో కొనసాగాయి గోపికల నడుమ శ్రీకృష్ణుడు వేషాధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యత పిల్లలకు తెలిసేలా చేయడం చాలా సంతోషంగా ఉందని మరియు విద్యతో పాటు మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియడం అవసరం అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఆసిఫ్ సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.