Listen to this article

మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లో వరుసగా కురుస్తున్న వర్షానికి సోయాబీన్ పంట నీట మునగడం జరిగింది , ఈరోజు చిన్న ఎక్లారా, అంతాపూర్, మరియు దన్నుర్ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజు సోయాబీన్ నీట మునిగినా పంటలను వర్షం తగ్గినాక మరల పంటలను పరిశీలించి ఎంత మేర నష్టం వాటిల్లన్నేది నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేయడం జరిగింది. మండల రైతులు ఈ సమయంలో ఎరువులు, పురుగు మందులను పిచికారి చేయొద్దని సూచించడం జరిగింది. వర్షం తగ్గినాక , పొలంలో నీటిని తీసివేసి వ్యవసాయ అధికారుల సూచనలతో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ వో అనిల్ , గ్రామ రైతులు పాల్గొన్నారు