Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 17( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి సమస్య అధికంగా ఉండడంతో మోటార్లు కాలిపోతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, దృష్టికి రైతులు తీసుకెళ్లగా తక్షణమే ఎస్ ఈ శ్రావణ్ కుమార్, తో మాట్లాడి 100కెవి నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు ఇప్పించారని శుక్రవారం రోజున ట్రాన్స్ఫార్మర్ బిగింపచేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న
లో ఓల్టేజి ఇబ్బందులు తెలుపగానే సత్వరమే సమస్య తీర్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ కిషన్, రైతులు చంద్రాగౌడ్, తలారి ప్రభాకర్, శంకర్, దేవి, రాములు,రంజిత్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.