

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి- జి రోహిత్
జనం న్యూస్- ఆగస్టు 18 నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 4వ వార్డు ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ రోడ్డు కంకర తేలి గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉందని కావున కొత్త సిసి రోడ్డు నిర్మించాలంటూ ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లొ 4వ తరగతి చదువుతున్న విద్యార్థి గొట్టిముక్కల రోహిత్ నందికొండ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశాడు. వివరాల్లోకి వెళితే నందికొండ మున్సిపాలిటీ 4వ వార్డు ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ రోడ్డు కంకర తేలి గుంతలు పడి అస్తవ్యస్తంగా మారింది, వర్షాకాలంలో నీరు గుంతల్లో చేరి విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు, ద్విచక్ర వాహనదారులు వెళ్లేటప్పుడు గుంతల్లో ఉన్న వర్షపు నీరు తమ స్కూల్ డ్రెస్సులపై, పుస్తకాలు మరియు ఒంటిపై పడి తాము అసహనానికి, అనారోగ్యానికి గురవుతున్నామని, తడిచిన బట్టలతో స్కూలుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని, గుంతలలో నిలిచి ఉన్న నీరు వల్ల దోమలు చేరి సీజనల్ వ్యాధులకు తరచూ గురవుతున్నామని, కావున తమ బాధలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సిసి రోడ్డును నిర్మించాలని నందికొండ మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన గొట్టిముక్కల రోహిత్ తండ్రి పేరు జి శివశంకరాచారి, వినూత్నంగా ఆలోచించి తన తండ్రి సహకారంతో నందికొండ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
