

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన వ్యవసాయ అధికారి వి మృదుల
డా. ఎం గిరిజా రాణి , ప్రధాన శాస్త్రవేత్త (వరి),
డా.టి.శ్రీనివాస్, సహ పరిశోధనా సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు
ప్రస్తుత ఆగష్టు మాసంలో కురుస్తున్న అధిక వర్షాలకు పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుండి పిలకలు దశలో నీట ముంపుకు గురికావడం జరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎం.టి.యు 1318, స్వర్ణ , సంపద స్వర్ణ, ఎం.టి.యు 1061 మరియు ఎం.టి.యు 1064 రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి. పంట ఊడ్చిన వెంటనే నీట మునిగి మొక్కలు చనిపోయిన ఎడల మనేదలు వేసుకోవాలి
నారుమడి లేక ఎద పద్దతిలో విత్తిన పొలం నీట మునిగితే: నారుమడిలో విత్తనం చల్లిన వెంటనే మూడు కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. వీలైనంత త్వరగా మడిలోనుండి నీరు బయటకు తీసి వేసి పొలం ఆరగట్టాలి. నారుమడి పూర్తిగా దెబ్బతిన్న ఎడల అందుబాటులో ఉన్న స్వల్పకాలిక రకాలతో మరలా తిరిగి విత్తుకోవాలి.విత్తిన 7 నుండి 30 రోజుల మద్యలో నారు 5 రోజుల కన్నా ఎక్కువ మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక నీట మునిగిన నారు మడి నుండి వీలైనంత తొందరగా నీటిని బయటకు తీసివేసి, తర్వాత 5 సెంట్ల నారుమడికి 1.0 కిలోల యూరియా + 1.0 కిలో పొటాష్ వేసుకోవాలి. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1.0 గ్రా. కార్బెన్డిజిమ్ లేదా 2.0 గ్రా కార్బెన్డిజిమ్ + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.పిలకల దశలో మునిగితే : పిలకల దశలో సాధారణ రకాలు 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి. అదే ముంపును తట్టుకునే ఎం.టి.యు 1064, పి.ఎల్.ఎ 1100 వంటి రకాలు వారం రోజుల వరకు ముంనక తట్టుకుంటాయి, అలాగే ఆకులు పైకి కనిపిస్తూ 30 – 40 సెంటీ మీటర్ల నీరు నిలబడే పల్లపు ప్రాంతల్లోని మధ్యస్థ ముంపుని కూడా తట్టుకుంటాయి. అదే ఎం.టి.యు 1232 రకం అయితే 10 – 12 రోజుల పాటు తాత్కాలిక ముంపును కూడా తట్టుకుంటుంది.పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత్త త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 – 15 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలి.కాట్రేనుకున వ్యవసాయ అధికారి వి మృదుల
