Listen to this article

జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణానికి చెందిన టీ.మోహన్‌ భారీ సైబర్‌ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పి దఫదఫాలుగా రూ.20 లక్షలను కేటుగాడు లాగేశాడు. నిందితుడి బ్యాంక్‌ ఖాతాలో 9సార్లు బాధితుడు నగదు జమ చేయించుకున్న అనంతరం ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌లో పెట్టేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌ టౌన్‌ సీఐ చౌదరి తెలిపారు.