జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో సోమవారం బాలిక సహస్ర హత్యకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం రమేష్ స్థానిక నాయకులతో కలిసి సంఘటనా స్థలాని పరిశీలించారు. పోలీసులను స్థానికులను కలిసి ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి సహస్ర హత్యను ఆయన ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము వేణు, తూము సంతోష్ ,మేకల రమేష్, గోవిందు, నాగరాజు ,భాస్కర్ ,సోను, మేఘనాథ్, శ్రావణ్, వాసు, తదితరులు పాల్గొన్నారు.



