జనం న్యూస్, 19 ఆగస్టు 2025 ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కుప్పా నగర్ గ్రామ శివారులో, రోడ్డు ప్రక్కన, ఉపయోగములో లేని, దాబా హోటల్లో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి, ఉరివేసుకుని చనిపోయినట్లు, మృతుడి వయస్సు దాదాపు 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉండవచ్చని, ఝరాసంగం ఎస్సై, క్రాంతి కుమార్ పాటిల్, తెలిపారు.మృతి చెందిన వ్యక్తి, వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే, ఈ క్రింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఝరాసంగం ఎస్సై ఫోన్ నెంబరు 8712656771, లేదా సిఐ రూరల్ ఫోన్ నెంబరు 8712656732 ఈ నంబర్లకు ఫోన్ చేసి మృతుడు వివరాలు తెలియజేయాలని తెలిపారు.


