జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాట్రేనికోనలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ జాక్విన్ మాండ్ చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో దొంగ రమణ, సంసాని అర్జున్, ఓలేటి సత్యం, మున్నా, రామారావు, తదితరులు పాల్గొన్నారు


