బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి
జనం న్యూస్, ఆగస్టు 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకూరి మధుసూదన్ రెడ్డి అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ రెడ్డి, మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు, ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.పిల్లలు ఎక్కడకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు,కుంటలు చెరువులు బాగా నిండి ఉన్నాయి కాబట్టి పిల్లలు అక్కడికి వెళ్లకుండా చూడాలన్నారు, రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు వర్షా కాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే· తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు , తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు పట్టుకోరాదు · కరెంట్ లైన్లకు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు · ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తడి చేతులతో టచ్ చేయకూడదు అని చెప్పారు.


