Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 19

చెన్నారెడ్డిపల్లి మరియు నాయుడు పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి బి జోష్ణ దేవి నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటలు భీమా పథకాన్ని ఆగస్టు 30వ తారీకు వరకు పొడిగించారని తెలియజేశారు. బీమా చేసుకునే రైతులు త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఖరీఫ్ 2025 ఈ పంట నమోదు కార్యక్రమాన్ని మండలంలో చేపట్టి ఉన్నారు కావున రైతులందరూ వారు వేసినటువంటి పంటలను ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ పథకo లో రైతులకు ఎవరికైనా సమస్య ఉన్న ఎడల వారి యొక్క రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ పథకము గ్రీవెన్స్ మోడల్ రేపటితో ముగుస్తుందని తెలిపారు. అనంతరం చెన్నారెడ్డిపల్లి మరియు నాయుడు పల్లి గ్రామాలలో వేసిన పెసర కంది మొదలుకు పేర్లను రైతులతో కలిసి పరిశీలించారు. పెసర పంటలు దోమ ఎక్కువగా ఉన్నందువలన ఎసిటామైప్రిడి పురుగుమందును ఒక గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకొని నివారణ చేసుకోవాలని తెలియజేశారు. చెన్నారెడ్డిపల్లి మరియు తర్లుపాడు గ్రామాలలో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, రైతు సేవ కేంద్రం సిబ్బంది అరవింద్, సావిత్రి, ఏపీ సి ఎన్ ఎఫ్ సిబ్బంది వెంకటనారాయణ రెడ్డి చెన్నారెడ్డిపల్లి మరియు తర్లపాడు గ్రామ రైతులు పాల్గొన్నారు.