Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి

బీజేపీ సంచార జాతుల స్ఫూర్తి కార్యక్రమం కరపత్రాలను మంగళవారం బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం జిల్లా ఇంచార్జ్ మహాలక్ష్మి రావు మాట్లాడుతూ ఆగస్ట్ 31వ తేదీన సంచార జాతుల విముక్త జాతుల దినోత్సవం పురస్కరించుకుని సంచార “జాతులం సదాచార వారసులం సంస్కృతుల వారధులం” అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈ నెల 30 తేదీన విజయవాడ వెన్యూ ఫంక్షన్ హల్ వద్ద సంచార సమాజాన్ని స్ఫూర్తిప్రధాతలుగా తెలుపుతూ “స్ఫూర్తి” కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని ఈ కార్యక్రమం మహాలక్ష్మిరావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపుతో రాష్ట్రంలో సంచార కులాల పెద్దలను బీజేపీ ఆహ్వానిస్తుంది జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా సంచార కులాల వృత్తులు కలలు ప్రదర్శించడం శోభయాత్ర నిర్వహించడమే కాకుండా కళాకారులకు, ఉద్యమ నాయకులకు, అవార్డు గ్రహీతలకు కళాకారులకు సత్కారాలు వుంటాయని రాష్ట్రంలో బీసీ సంచార కుల సంఘాలు నాయకులు కుల పెద్దల ఆశీస్సులు వారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ” స్ఫూర్తి ” కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సంచార సమాజం సమస్యలు దీర్ఘకాళిక అంశాలపై కూడా రూట్ మ్యాప్ ప్రకటించుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార సమాజం లో వివిధ సంచార సంఘాలు మేధావులు నాయకులు కుల పెద్దలు యువత మహిళలు అందరు “స్ఫూర్తి ” కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని,అలాగే జిల్లాలో సంచార కులాలను కలసి అందరిని ఆహ్వానిస్తామని సంచార సమాజం ఆత్మగౌరవం చరిత్ర త్యాగం పోరాటపటిమ ఎదుర్కొంటున్న సమస్యలు డిమాండ్లు మిగతా సమాజానికి ప్రభుత్వాలకు మరియు అధికారులకు తెలిసే విధంగా ఒక పెద్ద పండుగలా “విముక్త జాతుల దినోత్సవాన్ని” జరుపుకునేలా స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.