Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

గత పది సంవత్సరాలుగా అమరావతిపై జగన్ రెడ్డి వారి బ్యాచ్ విశప్రచారాలు చేస్తూ, అమరావతి పై ఏదో ఒక బూటక ప్రచారాన్ని రోజు సోషల్ మీడియాలో, సాక్షి పత్రిక సాక్షి మీడియాలో, లేనివి ఉన్నట్లుగా, వాగులు వంకల దగ్గరకు వెళ్లి విడియాలు తీసి అమరావతి మునిగిపోతుందని అబద్ధపు ప్రచారాలతో నిత్యం బతుకుతున్న జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొద్దు నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లాలో క్లౌడ్ బస్టర్ జరిగి 19 సెంటీమీటర్ల వర్షం పడినప్పుడు అమరావతి మునగలేదని, నేడు ఇటీవల కురిసిన వర్షాలకు ఐకానిక్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో నీరు చేరితే, గోరంతల కొండంతలగా వైసిపి సోషల్ మీడియా, సుమన్ టీవీ, అద్దె మైకులు పెట్టుకుని, అదే పనిగా కొండవీటి వాగు దగ్గరికి వెళ్లి దుర్మార్గం ఆలోచనతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని, జగన్ రెడ్డి డైరెక్షన్ లో కుయుక్తులు పన్నుతున్నారని, కళ్ళున్న కబోధులు అమరావతి పరిసర ప్రాంతాల్లో మీడియా ను తీసుకుని వెళ్లి చూస్తే, నిజం తేటతెల్లమవుతుందని, ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు నిధులు, ఏషియన్ బ్యాంకు నిధులు, నాబార్డు నిధులు, సింగపూర్ ప్రభుత్వం 45 వేల కోట్లు పెట్టుబడులతో, వివిధ సంస్థలు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న సమయంలో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు, దొంగ ఈమెయిల్స్ సోషల్ మీడియాలో నిత్యం అదేపనిగా జరుగుచున్న అభివృద్ధికి ఆటంకాలు కల్పించడానికి జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని, గత ఐదు సంవత్సరాల ప్రభుత్వములో లక్షల కోట్లు కాజేసింది కాకుండా లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి పాత్ర బయటకు రావడంతో అమరావతి పై విష ప్రచారాన్ని, మైండ్ గేమ్ ఆడటం జగన్ రెడ్డి అలవాటని, వారికి వెన్నతో పెట్టిన విద్యని నాగ జగదీష్ అన్నారు. ఇటీవల పులివెందుల నియోజవర్గంలో పులివెందుల జడ్పిటిసి ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో 30 సంవత్సరాల గా ఉన్న రాజకోట బద్దలవ్వడంతో జగన్ రెడ్డి తట్టుకోలేక, తన అవినీతి గ్యాంగ్ తో అమరావతి పై బూటక ప్రకటనలు చేయిస్తున్నాడని, నిన్న సుప్రీంకోర్టులో వివేకానంద కేసులో సునీత రెడ్డి పై, రాజశేఖర్ రెడ్డి సి.బి.ఐ రాoసింగి పై క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు క్యాష్ చేసిందని, అలాగే వివేకానంద కేసు విచారణ కొనసాగించాలని, బెయిల్ పై ఉన్న దోషులకు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి సునీత రెడ్డి విజ్ఞప్తి చేసిందని, విచారణ కొనసాగించాలని దోషులకు మరణశిక్ష పడుతుంది అనే సిబిఐ వ్యాఖ్యానించిందని, ఈ కేసు కు సంబంధించి సూత్రధారి, పాత్రధారి అవినాష్ రెడ్డిని కాపు కాస్తున్న జగన్ రెడ్డిని విచారించాలని నాగ జగదీష్ డిమాండ్ చేశారు.//