జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం:
నిగర్వి, నిరాడంబరుడు,మానవతావాది ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు.వెంకటాపురం జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల మొక్కలు నాటారు.వివిధ క్రీడా పోటీలు,సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఇలాంటి జన్మ దినోత్సవ వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తనపై చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



