ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు.
జనం న్యూస్ ఆగష్టు 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మండల అధ్యక్షులు నారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార, ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ అని అన్నారు.. భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆధ్యుడు పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకుడు దేశ సౌబ్రతృత్వం కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానీయులు, నవభారత నిర్మాత భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ, రాజీవ్ గాంధీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు..ఈ కార్యక్రమంలోవాంకిడి పట్టణ అధ్యక్షులు మండొకర్ అనిల్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు జాబోరే గణేష్ ,మాజీ సింగిల్ విండో చైర్మన్ మండొకర్ దదాజి మాజీ ఉప సర్పంచ్ సెల్వట్ కార్ పెంటు, జాడే సోమ, ఉ ప్రే ధర్మ ,ధర్మాజీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
…


