జనం న్యూస్ ఆగష్టు 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం భారత రత్న,మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మునగాల మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి కలిగిన నాయకుడని, దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.ఆయన ప్రవేశపెట్టిన సాంకేతిక విప్లవం, పంచాయతీ రాజ్ వ్యవస్థ, యువతకు అవకాశాలు కల్పించడంలో చూపిన దృక్పథం నేటికీ ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.18 ఏండ్లకే యువత పాలనలో భాగస్వామ్యం కావాలని 18 ఏండ్లకే యువకులకు ఓటు హక్కును కల్పించారని తెలిపారు.దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని… విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావ్, గంధం సైదులు శెట్టి గిరి, శీను, గోపి, శర్మ,. పనస శంకర్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


