Listen to this article

కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

జనం న్యూస్. ఆగస్టు 20. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు.స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారంనాడు హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులుఅర్పించిన కాంగ్రెస్ పార్టీజిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిఎంఏ హకీమ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. మనమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.స్వర్గీయ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ పేద,బడుగు, బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కర్రె కృష్ణ,మాజీ సర్పంచ్ కొన్యాల వెంకటేశం,కోటంల వెంకటేశం,అజీజ్,నర్సింలు,సామా గౌడ్,అనిల్ రెడ్డి, అంజాగౌడ్,దుర్గం గౌడ్, సోహెల్.గౌస్.అబ్దుల్ ఖదీర్. మల్లిగారి సాయికుమార్. వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు