Listen to this article

జనం న్యూస్: ఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు. తొలుత యాక్సిడెంట్‌ గా భావించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా వ్యక్తి తానే నేరుగా లారీ కింద పడినట్లు గుర్తించారు, మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరో ఘటనలో నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

https://x.com/ChotaNewsApp/status/188371981554380397