వరద కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టాల
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
(జనం న్యూస్ 21ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి )
జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల పనులు త్వరగా చేపట్టి పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని భీమారం మండలం పరిధిలో గల బూరుగుపల్లి నుండి దాంపూర్ కు వెళ్లే దారిలో గేర్రగూడెం సమీపంలో దెబ్బతిన్న రహదారిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్, ఉపతహసిల్దార్ అంజమ్మ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను పరిశీలించి పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజారక్షణ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నది తీరాలకు ఎవరు వెళ్లకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడం జరిగిందని. తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని, అత్యవసర సేవల నిమిత్తం 90 మంది సభ్యులతో కూడిన 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, రక్షణ పరికరాలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా రక్షణ దిశగా అన్ని చర్యలు చేపడుతున్నామని మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని . మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులు వినియోగించాలని . ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని . అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జూనియర్ కళాశాల వరకు నవీకరించిన నేపథ్యంలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మాజీ జడ్పీటీసీ భూక్యా తిరుమల, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు



