

బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి. జి విద్యార్థుల చే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎం.ఎ తెలుగు, ఎం.ఎ ఆంగ్లం, ఎం.కం విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటరు . మొక్కలు నాటడంతో పాటు కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పి.జి.కోఆర్డినేటర్ టి.సంతోష్ మరియు కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
