

జనంన్యూస్. 22. సిరికొండ.ప్రతినిధి.
సిరికొండ మండలంలో ని రైతులకు సొసైటీల ద్వారా మండల రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. మండలానికి సరిపడ యూరియా దఫల వారీగా రైతులకు అందించడం జరిగింది. మండలానికి వానకాలానికి సంబంధించి 3100 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగినది. మండలంలో సరిపడ యూరియా అందుబాటులో ఉన్నది, వేరే గ్రామరైతులు లకు యూరియా సరఫరా చేయాలని భావిస్తే వారి పైన కటిన చర్యలు తీసుకోవడం జరుగును. మండలంలోని చిమంపల్లి గ్రామంలో ట్రాన్స్ పోర్టు వాహనాలు తనిఖీలు చేయడం జరిగినది, వాహన దారులకు అవగాహన కల్పించాము. వేరే గ్రామ లకి యూరియా తరలించాలని ఆటో వారు గానీ, ట్రాన్స్ పోర్టు వాహనాలు గానీ ప్రయత్నిస్తే కటిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల ఏఈఓ నరసయ్య తెలిపారు.