జనం న్యూస్,ఆగస్టు22, అచ్యుతాపురం:
ఆర్య వైశ్యల ఆలయ సమిదిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం 5వ శుక్రవారం సందర్భంగా కారుమూరి గోపి,చందు, రవి, కన్నబాబు, నానాజీ,శివరాం,మల్లికార్జునరావు,స్వామి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు మరియు మణిద్వీప వర్ణ పూజలు మహిళలచే ఘనంగా జరిగాయి.ఆర్యవైశ్యల కులదైవం వాసవీమాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.


